111.The Palm Fibre

  1. అబూ లహబ్ రెండు చేతులూ నశించుగాక మరియు అతడు కూడా నశించి పోవు గాక
  2. అతడి ధనం మరియు అతడి సంపాదన (సంతానం) అతడికి ఏ మాత్రం పనికి రావు
  3. అతడు ప్రజ్వలించే నరకాగ్నిలో కాల్చబడతాడు
  4. మరియు అతడి భార్య కూడా! కట్టెలు మోసే (చాడీలు చెప్పి కలహాలు రేకెత్తించే) స్త్రీ
  5. ఆమె మెడలో బాగా పేనిని ఖర్జూరపునార త్రాడు (మసద్) ఉంటుంది