101.The Calamity

  1. ఆ! అదరగొట్టే మహా ఉపద్రవం
  2. ఏమిటా అదరగొట్టే మహా ఉపద్రవం
  3. మరియు ఆ అదరగొట్టే మహా ఉపద్రవం, అంటే ఏమిటో నీకేం తెలుసు
  4. ఆ రోజు మానవులు చెల్లాచెదురైన చిమ్మెటల వలే అయిపోతారు
  5. మరియు పర్వతాలు రంగు రంగుల ఏకిన దూది వలే అయి పోతాయి
  6. అప్పుడు ఎవడి త్రాసుపళ్ళాలు (సత్కార్యాలతో) బరువుగా ఉంటాయో
  7. అతడు (స్వర్గంలో) సుఖవంతమైన జీవితం గడుపుతాడు
  8. మరియు ఎవడి (సత్కార్యాల) త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో
  9. అతని నివాసం అధః పాతాళమే
  10. మరియు అది ఏమిటో నీకేం తెలుసు
  11. అదొక భగభగమండే అగ్ని (గుండం)